- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. నేమ్ కూడా రివీల్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల(Sonia Akula) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల(Sonia Akula) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన 'కరోనా వైరస్'(Coronavirus) సినిమాతో ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఈ చిన్నదానికి ఈ సినిమాతో అంతగా ఫేమ్ రాలేదు. ఇక బిగ్‌బాస్ సీజన్-8(Bigg Boss-8)లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ తన ఆట తీరుతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. కానీ పెద్దోడు-చిన్నోడు అంటూ నిఖిల్-పృథ్వీతో సోనియా నడిపిన ట్రాక్ ఆమెకి నెగిటివ్ అయింది. దీంతో ఊహించని విధంగా చాలా తక్కువ వారాల్లోనే బయటికి వచ్చేసింది.
ముఖ్యంగా సోషల్ మీడియా(Social Media)లో ఆమెపై చాలా నెగెటివిటీ వచ్చింది. దీంతో తిరిగి రీఎంట్రీలో భాగంగా హౌస్‌లోకి వెళ్లి నిఖిల్‌ని నామినేట్ చేస్తూ సోనియా ఏకిపారేసింది.ఆ తర్వాత హౌస్ నుంచి బయటికి రాగనే తన ప్రియుడు, బిజినెస్‌మ్యాన్ యష్(Yash)తో నిశ్చితార్థం.. వెంటనే పెళ్లి కూడా జరిగిపోయింది. అయితే తాను తల్లి కాబోతున్న అని సోనియా తన సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేస్తూ తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా సోనియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా సోనియా ఆమె భర్త యష్ వీరగోని ప్రకటించారు. అలానే తమ పాప పేరును కూడా అనౌన్స్ చేశారు. "ఆమె రాకతో మా ప్రపంచం సంపూర్ణం అయింది. మా ప్రేమకి మేము పెట్టిన మరో పేరు 'శిఖా వీరగోని'" అంటూ పాప పేరును ప్రకటించారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్స్, సెలబ్రెటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
READ MORE .....






