Vote for Bigg Boss Kalki: టాప్ 13లో సత్తా చాటుతున్న మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి

by Chukka Sudharani |   (  Updated:2025-09-04 08:56:22  IST  )

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-9 సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న విషయం తెలిసిందే.

Vote for Bigg Boss Kalki: టాప్ 13లో సత్తా చాటుతున్న మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-9 సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్‌గా వ్యవరిస్తున్న ఈ షోకు ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. దీంతో బిగ్‌బాస్ టీమ్ గత కొద్ది రోజుల నుంచి అగ్నిపరీక్ష పేరుతో.. సామాన్యుల సెలక్షన్ షురూ చేశారు. మరో నాలుగు రోజుల్లో ఈ రియాలిటీ షో ప్రసారం కావాల్సి ఉండగా.. ఇప్పటికే సెలక్ట్ అయినా టాప్ 15లో తాజాగా జరిగిన అగ్నిపరీక్ష ఎపిసోడ్‌లో ప్రసన్న కుమార్, శ్వేత అనే ఇద్దరు సామాన్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన టాప్ 13లో తన సత్తా చాటుకుంటుంది గీతా పార్వతి కర్నాటి అలియాస్ కల్కి. మిస్ తెలంగాణ రన్నరప్‌గా నిలిచిన ఈమె.. ఇప్పుడు బిగ్‌బాస్‌లో తోటి కంటెస్టెంట్‌లకు గట్టిపోటీ ఇస్తూ టాప్ 13లో నిలిచింది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేందుకు కల్కికి అన్ని క్వాలిటీస్ ఉండగా.. ప్రేక్షకుల సపోర్ట్ కోసం వెయిట్ చేస్తోంది. బిగ్‌బాస్ ఆడియన్స్ జియో హాట్ స్టార్ ద్వారా కల్కికి తమ ఓటు వేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నది. లింక్

Next Story