- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛీ.. ఛీ.. పెళ్లి చేసుకోను.. ఆ ఫీలింగ్స్ చచ్చిపోయాయి !
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది సోషల్ మీడియాను

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది సోషల్ మీడియాను నమ్ముకొని ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది ఇండస్ట్రీలో తమకు తెలిసిన వాళ్లను పట్టుకొని.. ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఇక మరికొంతమంది నేరుగా ఇండస్ట్రీకి వచ్చి అదృష్టాన్ని... పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే అచ్చం అలాగే శ్రీ సత్య అనే యువ నటి కూడా ఇండస్ట్రీలో... ముందుకు సాగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న శ్రీ సత్య... బిగ్ బాస్ ద్వారా మాత్రం బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చి... ఆ తర్వాత స్టార్ అయిపోయారు. దీంతో అప్పటి నుంచి ఆమెకు మంచి గుర్తింపు దక్కుతోంది.
అయితే అలాంటి శ్రీ సత్య... తాజాగా తన పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛీ... ఛీ నేను పెళ్లి చేసుకోను... ఆ ఆశ లేదు.. ఆ ఫీలింగ్స్ అన్ని చచ్చిపోయాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక ఆమె చేసిన కామెంట్లపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. లవ్ ఫెయిల్యూర్ అయినట్లు ఉంది.. అందుకే శ్రీ సత్య ఇలా మాట్లాడిందని అంటున్నారు.






