- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సినిమా షూటింగ్‌పై బిగ్ అప్డేట్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో ‘రౌడీ జనార్ధన్’ ఒకటి. ఈ మూవీని బడా నిర్మాణ సంస్థ SVCబ్యానర్‌లో రాబోతోన్న 59వ ప్రాజెక్ట్ కావడం విశేషం. దీనికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ‘రౌడీ జనార్ధన్’ మూవీపై రౌడీ హీరో ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలపై అనేక వార్తలు నెట్టింట వైరల్ కావడంతో.. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్ధన్’ మూవీ పూజా కార్యక్రమం అక్టోబర్ 11న గ్రాండ్‌గా స్టార్ట్ కానుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వార్త వైరల్ కావడంతో రౌడీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






