- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆదర్శకుటుంబం’ సినిమా రిలీజ్‌పై బిగ్ అప్డేట్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం- హౌస్ నెం. 47’.

దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం- హౌస్ నెం. 47’. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది. ఈ మూవీకి సంబంధించి ఇంకో 25, 30 రోజుల్లో టోటల్ షూట్ కంప్లీట్ అవ్వనుందని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. అంతే కాకుండా.. షూట్ కంప్లీట్ చేసుకున్న అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచి, ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వినికిడి.
ఇదిలా ఉంటే.. ఆదర్శ కుటుంబం ఇంటర్వెల్ బాంగ్ & క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ మేజర్ హైలెట్స్ అని టాక్. అలాగే ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ఒక 'ట్రైన్ ఎపిసోడ్' సినిమాకే హైలైట్ అని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తుండగా.. ఈ సినిమాపై రోజు రోజుకు ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్‌పై అప్డేట్ రావడంతో.. విడుదల కోసం ఈగర్‌గా వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు వెంకటేష్ ఫ్యాన్స్.






