The Rajasaab: ది రాజాసాబ్‌కు ఆల్ క్లియర్.. ఫైనల్ షెడ్యూల్‌పై బిగ్ అప్డేట్

by Chukka Sudharani |   (  Updated:2025-08-24 14:51:54  IST  )

సినీ కార్మికుల సమ్మెలు కారణంగా సినిమాల షూటింగ్‌కు వాయిదా పడిన విషయం తెలిసిందే.

The Rajasaab: ది రాజాసాబ్‌కు ఆల్ క్లియర్.. ఫైనల్ షెడ్యూల్‌పై బిగ్ అప్డేట్
X

దిశ, సినిమా: సినీ కార్మికుల సమ్మెలు కారణంగా సినిమాల షూటింగ్‌కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ గొడవలు సద్దుమనగడంతో మళ్లీ షూటింగ్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘ది రాజాసాబ్’ (The Rajasaab)సినిమా ఫైనల్ షెడ్యూల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. రాజాసాబ్ షూటింగ్‌కు మొత్తం సెట్ కాగా.. రేప‌టి నుంచే షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నారట. ఈనెలాఖ‌రు వ‌ర‌కూ అజీజ్ న‌గ‌ర్‌లో షూటింగ్ జరగనుండగా.. 28 వ‌ర‌కు ప్రభాస్‌పై కొన్ని ముఖ్యమైన సీన్స్ చిత్రీకరించనున్నారట మేకర్స్.

అలాగే సెప్టెంబ‌రు 17 నుంచి కేర‌ళ‌లో ప్రభాస్ ఇంట్రడ‌క్షన్ సాంగ్‌ షూట్ ఉండగా.. ఆ తర్వాత‌ గ్రీస్‌లో రెండు పాట‌లు చిత్రీక‌ర‌ణ‌ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్‌తో ‘ది రాజాసాబ్’ షూటింగ్ దాదాపు పూర్తి కానుందట. కాగా.. ఈ మూవీకి మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 5 రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10కు పోస్ట్ పోన్ అయినట్లు టాక్.

Next Story