- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
The Rajasaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’పై బిగ్ అప్డేట్.. 3 నిమిషాల 30 సెకన్లతో రాబోతోన్న ట్రైలర్!
సినీ ప్రియులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి.

దిశ, సినిమా: సినీ ప్రియులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ అండ్ హారర్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ టైమ్ ప్రభాస్ ఓ డిఫరెంట్ జానర్‌లో సినిమా చేయబోతుండగా.. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా ఇప్పుడు 2026 సంక్రాంతి సందర్భంగా వచ్చేందుకు సిద్ధం అవుతున్నది.
ఇందులో భాగంగా తాజాగా ది రాజాసాబ్ ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. టాలీవుడ్ ఫిలిమ్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు.. ‘రాజాసాబ్ ట్రైలర్‌కి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఐదు భాషల్లోనూ సెన్సార్ చేయించగా.. UA 13+ సర్టిఫికేట్ జారి చేశారు. 3 నిమిషాల 30 సెకన్లు నివిడితో ఉన్న ఈ ట్రైలర్ అక్టోబర్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్’ అని తెలుస్తుంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉండగా.. ప్రజెంట్ సెన్సార్‌కు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






