Prabhas: ప్రభాస్ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. ప్రీక్వెల్‌కు సిద్ధం అవుతున్న ఫౌజీ

by Chukka Sudharani |

డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టులలో ‘ఫౌజీ’ ఒకటి.

Prabhas: ప్రభాస్ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. ప్రీక్వెల్‌కు సిద్ధం అవుతున్న ఫౌజీ
X

దిశ, సినిమా: డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టులలో ‘ఫౌజీ’ ఒకటి. 1970ల నాటి పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందబోతున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తవగా.. ఇందులో హీరోయిన్‌గా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఫౌజీ మూవీ అనౌన్స్ చేసిన తర్వాత అందులో నుంచి ఒక్క పోస్టర్ మాత్రమే రావడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫౌజీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే ఈ చిత్రం 60% షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుండగా.. వచ్చే ఏడాది ఆగస్టు 14 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడిగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా.. దేశభక్తి నేపథ్యంలో వచ్చే సినిమా కాబట్టి ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమాకు రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లా్న్ చేస్తున్నారని టాక్. దీంతో పాటు ఈ సినిమా ప్రీక్వెల్‌కు కూడా సిద్ధం అవుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సీనియర్ నటి జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story