- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ రచ్చా.. అనౌన్స్‌మెంట్ వీడియో వైరల్
బిగ్ బాస్ సీజన్ 10పై అప్డేట్ ఇస్తూ వీడియో రిలీజ్ అయింది.

దిశ, సినిమా: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 10కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే 9 సీజన్లు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు పదొవ సీజన్‌కు ముస్తాబైంది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు టీమ్. ‘బిగ్ బాస్.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు.. ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం. ఆ మహా సామ్రాజ్యం గురించి రూల్ చేసే నేను కాదు.. లవ్ చేసే ఫ్యాన్స్ చెబుతారు’ అంటూ నాగార్జున పవర్ ఫుల్ డైలాగ్‌తో స్టార్ట్ అయిన వీడియో ఆద్యంతం అలరించేలా ఉంది. అలాగే బిగ్‌బాస్‌పై రూపొందించిన పాట వీడియోలో ప్రత్యేకంగా నిలిచింది. ‘ఈ ప్రస్థానం మరో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతున్నది.. ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ దశవతారం. ‘బిగ్ బాస్ సీజన్ 10 ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’’ అనే క్యాప్షన్‌తో కొత్త సీజన్ ఎంత రసవత్తరంగా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు నాగ్. ప్రజెంట్ ఈ బిగ్ బాస్ వీడియో వైరల్ అవుతూ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. అయితే గత సీజన్‌లో సెలబ్రిటీలతోపాటు సామాన్యులకూ కూడా అవకాశం కల్పించగా.. అగ్ని పరీక్షను దాటుకుని హౌస్‌లోకి అడుగుపెట్టారు. మారీ ఈసారి కేవలం సెలబ్రిటీలేనా? లేదా సామాన్యులకు కూడా అవకాశం ఇస్తారా? ఇస్తే ఎలాంటి పోటీలు నిర్వహిస్తారు అనేది ఉత్కంఠంగా మారింది.






