NTR బర్త్ డే స్పెషల్.. వార్-2 నుంచి BIG అప్డేట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-19 15:14:57  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వార్-2’.

NTR బర్త్ డే స్పెషల్.. వార్-2 నుంచి BIG అప్డేట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వార్-2’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వ వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ‘వార్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ విడుదల కాబోతుందా? అని ఎన్టీఆర్, హృతిక్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చేయబోతున్నట్లు ప్రకటించింది. రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు టీజర్ రాబోతోదంటూ తెలిపారు. అంతేకాకుండా అన్ని గన్స్ ఉన్న పోస్టర్‌ను షేర్ చేసి క్యూరియాసిటీని పెంచారు.

Next Story