- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ ఇయర్ స్పెషల్‌గా ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి బిగ్ అప్డేట్.. అధికారిక ప్రకటనతో హైప్ పెంచిన మేకర్స్
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం హీరో రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త తరం హీరో రాబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అన్న రమేష్ బాబు(Ramesh Babu) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ(Ghattamaneni Jayakrishna) హీరోగా నటిస్తున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’(Srinivasa Mangapuram). ఈ క్రేజీ ప్రాజెక్టును RX 100, మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని(Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోంది.
లవ్ అండ్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్(P.Kiran) నిర్మిస్తుండగా.. అశ్వనీదత్(Ashwin dutt) సమర్పిస్తున్నాడు. జీవీ ప్రకాష్(GV Prakash) సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ డైరెక్టర్ అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా థీమ్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. అలాగే.. ‘ఈ నూతన సంవత్సరం మరింత పెద్దదిగా, మెరుగ్గా మరియు ధైర్యంగా ఉండబోతోంది.
మా ఇంటెన్స్ లవ్ టేల్.. శ్రీనివాసమంగపురం యొక్క థీమ్ మోషన్ పోస్టర్ ఇదిగో.. జనవరి 1, 2026న జయకృష్ణఘట్టమనేని యొక్క అద్భుతమైన ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నాము’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. ఈ సినిమా థీమ్ మోషన్ పోస్టర్ అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






