HHVM: పవర్ స్టార్ సినిమాను విడుదల చేయబోతున్న మెగాస్టార్ కొడుకు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-23 16:34:59  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu).

HHVM: పవర్ స్టార్ సినిమాను విడుదల చేయబోతున్న మెగాస్టార్ కొడుకు
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు(Harihara Veeramallu). ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. భారీ చిత్రాల నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని మలయాళం(Malayalam)లో నటుడు దుల్కర్ సల్మాన్ రిలీజ్(Dulquer Salmaan) చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయమై గతకొన్ని రోజులుగా వార్తలు విస్తృతం కాగా, తాజాగా చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. పవన్ కల్యాణ్ కెరియర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడం.. ఈ చిత్రాన్ని మలయాళంలో అక్కడి స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేస్తుండటం పవన్ కల్యాణ్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌(Nidhi Agarwal). బాబీ డియోల్, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో రానుంది. ట్వీట్

Next Story