Official: ‘హరిహర వీరమల్లు’ నుంచి BIG అప్డేట్

by Gantepaka Srikanth |

పవన్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Star Pawan Kalyan) కెరియర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోన్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.

Official: ‘హరిహర వీరమల్లు’ నుంచి BIG అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Star Pawan Kalyan) కెరియర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోన్న హరిహర వీరమల్లు(Harihara Veeramallu) నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అతి త్వరలోనే మిగిలిన అప్డేట్స్ ఇస్తామని.. సాంగ్స్‌, ట్రైలర్‌తో ఫ్యాన్స్‌‌కు మాంచి ట్రీట్ ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ సినిమాతో థియేటర్స్ బ్లాస్ట్ అవ్వడం ఖాయమని తెలిపారు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 30వ తేదీన సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. హరిహర వీరమల్లుతో పాటు మిగిలిన రెండు సినిమాలకు కూడా పవన్ కల్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 14వ తేదీ నుంచి సుజిత్ కాంబినేషన్‌లో వస్తోన్న ఓజీకి, అది పూర్తయిన తర్వాత జూలైలో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌కు కూడా డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే సెప్టెంబర్‌లో ఓజీ, 2026 సమ్మర్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story