- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘NC-24’ నుంచి బిగ్ అప్‌డేట్.. పోస్టర్‌తో హైప్ పెంచేసిన మూవీటీమ్
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) రీసెంట్‌గా 'తండేల్'(Thandel) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారన్న సంగతి మనందరికీ తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) రీసెంట్‌గా 'తండేల్'(Thandel) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో NC-24 అనే మూవీలో నటించనున్నాడు. అయితే దీనిని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
ఇక ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ఒక అడుగు ముందుకు మరో అడుగు దగ్గరగా.. రెండో షెడ్యూల్ మొదలైంది’ అనే క్యాప్షన్ జోడించారు. ఇక పోస్టర్‌లో నాగ చైతన్య చాలా స్టైలీష్ అండ్ సీరియస్ లుక్‌లో కనిపించాడు. చేతిలో కత్తి పట్టుకుని గంబీరంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.






