- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోస్ట్ అవైటెడ్ రామాయణ నుంచి బిగ్ అప్డేట్.. గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రామాయణ మూవీ గ్లింప్స్‌ను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీశ్ తివారీ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రామాయణ’ చిత్రం గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం. తొలి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ గ్లింప్స్ విడుదలకు సంబంధించిన తేదీ ఖరారైంది.
ఈ చిత్ర బృందం గ్లింప్స్ వీడియోకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు ఈ గ్లింప్స్‌కు క్లీన్ ‘U’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ వీడియో 2 నిమిషాల 38 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్లింప్స్‌ను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో, మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న గ్లింప్స్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తుండగా, నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






