కాటేదాన్ కు మహేష్ బాబు..‘వారణాసి’ కోసం జ‌క్క‌న్న భారీ ప్లాన్‌!

by velandi.Saikiran |   (  Updated:2026-05-21 13:03:45  IST  )

‘వారణాసి’ కోసం హైద‌రాబాద్ లో జ‌క్క‌న్న భారీ ప్లాన్ చేశాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కాటేదాన్ కు మహేష్ బాబు..‘వారణాసి’ కోసం జ‌క్క‌న్న భారీ ప్లాన్‌!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి, వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ మూవీ గురించి మరో న్యూస్ వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని కాటేదాన్ పారిశ్రామిక ఏరియాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో సాంగ్ షూట్ చేసేందుకు జక్కన్న టీం సిద్ధమైందట.

ఇందులో మహేష్ బాబు కూడా పాల్గొంటారని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. అయితే ఈ సాంగ్ షూట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపైన క్లారిటీ రాలేదు. ఈ నెల చివరలో ఉంటుందని సమాచారం. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మెరువనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, వారణాసిపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Next Story