- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NBK111: డ్యూయల్ రోల్‌లో బాలకృష్ణ.. NBK111 వచ్చిన అప్డేట్‌తో ఆనందంలో ఫ్యాన్స్
వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం అఖండ-2తో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం అఖండ-2తో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఓ హిస్టారికల్ మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు. NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో సిద్ధం అవుతున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. సెన్సేషనల్ హిట్ వీరసింహ రెడ్డి తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషనల్‌లో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. తాజాగా మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అక్టోబర్ 24 నుంచి గ్రాండ్‌గా స్టార్ట్ కాబోతున్నట్లు తెలిపారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.. అందులో ఒకటి ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ప్రత్యేక పాత్ర అని తెలుస్తుంది. ఈ లుక్ స్పార్టకస్ & అలెగ్జాండర్ నుండి ప్రేరణ పొందిందని, యాక్షన్‌తో కూడిన గొప్ప సామాజిక ఫాంటసీ చిత్రం అని తెలుస్తుంది.






