- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి బిగ్ అప్‌డేట్.. మీ ముందుకు రాబోతుందంటూ క్రేజీ పోస్టర్ రిలీజ్..
టాలీవుడ్ హీరో నాగశౌర్య(Nagashaurya) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’(Bad Boy Karthik).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నాగశౌర్య(Nagashaurya) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’(Bad Boy Karthik). రామ్ దేశినా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు. విధి(Vidhi) కథానాయికగా నటిస్తోంది. ఇక యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈమూవీలో నాగశౌర్య మునుపెన్నడూ చూడని విధంగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీలో.. సముద్రఖని, వీకే నరేష్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి మ్యూజికల్ అప్‌డేట్ రాబోతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ఒకే ఒక్కడు రాసిన మ్యాజికల్ ఆల్బమ్ & అద్భుతమైన BGM కోసం సిద్ధంగా ఉండండి.. ప్రతిష్టాత్మక మ్యూజిక్ లేబుల్ @tseriesousth పై నాగశౌర్య యొక్క బ్యాడ్ బాయ్ కార్తీక్ ఆడియో.. త్వరలో మీకు ఒక సంగీత విభావరి రాబోతోంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో నాగ శౌర్య చాలా స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. Link






