పెద్దిలో ఐటమ్ సాంగ్...ఆ హీరోయిన్ కు కోట్ల‌ల్లో రెమ్యూన‌రేష‌న్ ?

by velandi.Saikiran |

పెద్ది సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ఫైనల్ అయినట్లు నడుస్తోంది.

పెద్దిలో ఐటమ్ సాంగ్...ఆ హీరోయిన్ కు కోట్ల‌ల్లో రెమ్యూన‌రేష‌న్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. పెద్ది ఆలస్యంగా రిలీజ్ కావడానికి ముఖ్య కారణం స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాటను మరో ఆరు రోజుల్లో ఫినిష్ చేసి...షూటింగ్ కు ప్యాకప్ చెప్పబోతున్నారట. పెద్ది సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ఫైనల్ అయినట్లు నడుస్తోంది. ఈ మూవీలో ఐటెం సాంగ్ చేసినందుకు దాదాపు మూడు కోట్లు వసూలు చేస్తోందట ఈ అందాల తార.

స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రేంజ్ వరకు సంయుక్త‌కు ఇచ్చేందుకు చిత్ర బృందం కూడా వెనకడుగు వేయలేదని సమాచారం. ఇక బుధవారం నుంచి వనస్థలిపురంలో ఈ సాంగ్ షూట్ ప్రారంభం కానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రామ్ చరణ్ మాస్ డాన్స్ కు, సంయుక్త గ్లామర్ తోడవడంతో ఈ సాంగ్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. కాగా మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో శివ రాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story