- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘డాకు మహరాజ్’లో ఎవరూ గెస్ చేయలేని బిగ్ సర్ ప్రైజ్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్!
నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా ఇవాళ(ఆదివారం) థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా ఇవాళ(ఆదివారం) థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రజెంట్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దుమ్మురేపుతోంది. అభిమానులు ఈ సినిమాలోని బాలయ్య డైలాగ్స్(Dialogues) అదుర్స్ అంటున్నారు. ఇక థమన్ BGM మాములుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు ఫ్యాన్స్ ఊగిపోయేలా ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నారు.
అయితే వీటితో పాటు ఈ మూవీలో ఫ్యాన్స్‌కు ఊహించని మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘దబిడి.. దిబిడి’ పాటలో బాలయ్యతో పాటు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, డైరెక్టర్ బాబీ స్పెషల్ అప్పియరెన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు ‘దబిడి.. దిబిడి’ పాటకు స్టెప్పులేశారు. దీంతో థియేటర్లు(Theaters) ఫ్యాన్స్ అరుపులు, కేకలతో మారుమోగాయి. బాలయ్యతో పాటు బాబీ, శేఖర్ స్టెప్పులేస్తుంటే జనం విజిల్స్ వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






