- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెల్లవారితే ‘వీరమల్లు’ ట్రైలర్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్(HHVM Trailer) మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్(HHVM Trailer) మరికొన్ని గంటల్లో విడుదల కాబోతోంది. జులై 3వ తేదీన ఉదయం 11.10 గంటలకు ఇది విడుదల కానున్నట్లు తెలిపింది. అయితే.. అనూహ్యంగా హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. చివరి నిమిషంలో ఫ్యాన్స్ ‘వైకుంఠం’గా భావించే సంధ్య థియేటర్‌లో ట్రైలర్ విడుదల క్యాన్సల్ అయింది. ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం బుధవారం తెలిపింది. భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉందని.. కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుందని.. జరుగరాని ఘటనలు జరిగే అవకాశం ఉందని అనుమానంతో సంధ్య థియేటర్‌లో ట్రైలర్ విడుదలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. హైదరాబాద్‌లోని మిగిలిన అన్ని థియేటర్లలో యధావిథిగా ట్రైలర్ విడుదల ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు పేర్కొన్నారు. కాగా, పవన్ కల్యాణ్ కెరియర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు వస్తుండటంతో ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ విలన్ పాత్ర పోషించారు. వచ్చు జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.






