- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Naga Chaitanya: అక్కినేని హీరోకు బిగ్ షాక్.. అప్పుడే ఆన్‌లైన్‌లోకి వచ్చిన ‘తండేల్’ సినిమా!
గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో అంతా పైరసీ భూతం పీడిస్తోంది. చిన్న సినిమాల కానుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అయినవి కూడా విడుదల రోజే ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో అంతా పైరసీ భూతం పీడిస్తోంది. చిన్న సినిమాల కానుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అయినవి కూడా విడుదల రోజే ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నాయి. ఈ పైరసీ ఇండస్ట్రీకి తీరని సమస్యగా మారింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పైరసీ చేసే కేటుగాళ్లను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ విషయంపై సినీ నిర్మాతలతో పాటు పలువురు స్టార్స్ కూడా పోలీసులుకు ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇటీవల రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన సినిమా ‘గేమ్ చేంజర్’(Game Changer) భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ కొన్ని గంటలకే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లోకి రావడంతో బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
దీంతో మూవీ టీమ్ ఫిర్యాదు చేసినప్పటికీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) ‘విదాముయార్చి’ మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. రిలీజైన కొన్ని గంటల్లోపే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. తాజాగా, నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్’(Thandel) మూవీ కూడా విడుదలైన రెండో రోజే ఆన్‌లైన్‌లోకి వచ్చేసినట్లు సమాచారం. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి వచ్చి ఘన విజయాన్ని సాధించింది.
అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 21. 27 కోట్లు రాబట్టింది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైనప్పటికీ ఈ సినిమాను కూడా పైరసీ భూతం వదల్లేదు. దీంతో నాగచైతన్యను బిగ్ షాక్ తగిలినట్టు అయింది. కత కొన్నేళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన ‘తండేల్’తో సూపర్ హిట్ అందుకున్నారు. అయినప్పటికీ పైరసీ వల్ల ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా అయ్యో పాపం నాగచైతన్యకు ఊహించని దెబ్బ తగిలినట్లు అయిందిగా అని అంటున్నారు.






