డాకు మహారాజ్ సినిమాకు BIG షాక్

by Gantepaka Srikanth |

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), యంగ్ డైరెక్టర్ బాబీ(Director Bobby) కాంబినేషన్‌లో వచ్చిన డాకు మాహరాజ్ సినిమా(Daku Maharaj Movie) థియేటర్లలో అదరగొడుతోంది.

డాకు మహారాజ్ సినిమాకు BIG షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), యంగ్ డైరెక్టర్ బాబీ(Director Bobby) కాంబినేషన్‌లో వచ్చిన డాకు మాహరాజ్ సినిమా(Daku Maharaj Movie) థియేటర్లలో అదరగొడుతోంది. పాజిటివ్ టాక్‌లో అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందానికి అనూహ్య షాక్ తగిలింది. సినిమా విడుదలైన రెండోరోజే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్(HD Print) దర్శనమిచ్చింది. దీంతో చిత్రబృందంతో పాటు బాలయ్య అభిమానులు కూడా షాక్‌కు గురయ్యారు. పైరసీని ఎంకరేజ్ చేయొద్దని.. ఇండస్ట్రీ బాగుపడాలంటే పైరసీ(Piracy)ని పూర్తిగా నిర్మూలించాలని నిర్మాతలు అభిమానులను కోరుతున్నారు. సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటించారు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలాలు హీరోయిన్లుగా నటించారు. తమన్‌ సంగీతం అందించారు.

Next Story