యాక్టర్ ఫవాద్‌ ఖాన్‌కు బిగ్ షాక్.. కేంద్ర సమాచార శాఖ కీలక నిర్ణయం

by Kema Shiva Kumar |

యాక్టర్ ఫవాద్‌ ఖాన్‌కు బిగ్ షాక్.. కేంద్ర సమాచార శాఖ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahalgam Terror Attack) నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు పాక్ ప్రఖ్యాత నటుడు ఫవాద్ ఖాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన తాజాగా నటించిన ‘ఆబిర్ గులాల్’ ('Abir Gulaal') చిత్రాన్ని దేశంలో బ్యాన్ చేయడంతో పాటు విడులను నిలిపి వేస్తున్నట్లుగా కేంద్ర సమాచార శాఖ (Central Information Department) ప్రకటించింది. పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది భారత పౌరులు అమరులయ్యారు.

ఈ నేపథ్యంలోనే భారత్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. దేశంలో పాక్ సినిమాలతో పాటు నటులపై నిషేధం విధించాలని పలువురు సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ నటుడు నటించిన ‘ఆబిర్ గులాల్’ను బహిష్కరించండి’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ‘X’ (ట్విట్టర్)లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అయితే, ఆ మూవీపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ దురదృష్టవశాత్తు ‘ఆబిర్ గులాల్’ మూవీ విడుదలైనా.. ఏ ఒక్కరు కూడా థియేటర్‌కు వెళ్లకూదంటున్నారు. మరికొందరేమో పాక్ నటులు ఒక్క కళ పేరుతో తప్ప మరే విషయంలోనూ వారికి భారతదేశం ఉండేందుకు చోటు లేదని.. ఇప్పుడు ఆ ఒక్క అవకాశాన్ని కూడా కోల్పోయారు.. ‘బైకాట్# ‘ఆబిర్ గులాల్’ అంటూ కామెంట్ చేశారు.

Next Story