Nithin: నితిన్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. రిలీజ్‌కు సిద్ధమైన ‘రాబిన్‌హుడ్’ (ట్వీట్)

by Hamsa |
Nithin: నితిన్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. రిలీజ్‌కు సిద్ధమైన ‘రాబిన్‌హుడ్’ (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ నితిన్(Nithin), శ్రీలీల(Sreeleela) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’(Robinhood). భీష్మ వంటి హిట్ అందించిన వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో రాబోతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్(G.V. Prakash Kumar) అందిస్తున్నారు.

యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా భారీ చిత్రాలు రిలీజ్ కావడంతో మూవీ మేకర్స్ చివరి నిమిషంలో వాయిదా పడినట్లు ప్రకటించి నితిన్ అభిమానులకు షాకిచ్చారు. దీంతో సినీ ప్రియులంతా నిరాశలో ఉన్నారు. మళ్లీ ‘రాబిన్‌హుడ్’(Robinhood) ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా, ఈ సినిమా విడుదలకు సిద్దమైనట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ‘రాబిన్‌హుడ్’(Robinhood) సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా నితిన్ పోస్టర్‌(Poster)ను షేర్ చేశారు. ఇందులో సివిల్ డ్రెస్ వేసుకున్న స్టైలీష్ పోలీసు ఆఫీసర్‌లా కనిపించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నితిన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed