ఆ స్టార్ హీరోకు హెల్త్ ఇష్యూ ...సినిమా షూటింగ్ వాయిదా ?

by velandi.Saikiran |   (  Updated:2026-01-19 05:08:05  IST  )

హీరో శింబు, వెట్రి మారన్ కాంబినేషన్ లో అరస‌న్‌ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

ఆ స్టార్ హీరోకు హెల్త్ ఇష్యూ ...సినిమా షూటింగ్ వాయిదా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తమిళ్ స్టార్ హీరో శింబు గురించి తెలియని వారు ఉండరు. 42 సంవత్సరాల ఈ తమిళ స్టార్ హీరో... ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకొని దూసుకువెళ్తున్నారు. రొమాంటిక్, సస్పెన్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలు చేస్తూ ఉంటారు హీరో శింబు. అయితే అలాంటి శింబు గురించి తాజాగా ఓ సంచలన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయనకు ప్రస్తుతం అనారోగ్యం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు టాక్ నడుస్తోంది.

హీరో శింబు, వెట్రి మారన్ కాంబినేషన్ లో అరస‌న్‌ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ వివరాలు ఇంకా తెలియ రాలేదు కానీ.. దాదాపు సగం వరకు షూటింగ్ పూర్తయిందట. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో హీరో శింబు అనారోగ్యం బారిన పడ్డారట. దీంతో షూటింగ్ కు వెళ్లడం లేదని టాక్ నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే తాను షూటింగ్ జరిగే ప్రదేశాలకు రాలేనని వెల్లడించారట. కావాలంటే అవే సెట్స్ చెన్నైకి షిఫ్ట్ చేయాలని కూడా శింబు కోరారట. దీంతో ఈ సినిమా దర్శక నిర్మాతలు సందిగ్ధంలో పడ్డట్లు టాక్ నడుస్తోంది. దీంతో ప్రాజెక్టు షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read More..

చివరి నిమిషం ట్విస్ట్‌తో ‘సికందర్’ ఫ్లాప్? రష్మిక సంచలన వ్యాఖ్యలు!

Next Story