తనపై తానే కేసు వేసుకున్న హీరోయిన్ భూమిక..

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-17 14:20:24  IST  )

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ‌, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తనపై తానే కేసు వేసుకున్న హీరోయిన్ భూమిక..
X

దిశ, సినిమా : బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నీలిమ గుణ‌, యుక్తా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నూతన నటీనటులతో గుణ శేఖర్ నేటి యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్య‌మైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్ కీలకపాత్రల్లో నటిస్తుండగా.. ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోతుంది.

ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కథ ‘సివిల్ సర్వెంట్’ కావాలని కలలు కనే ఒక సామాన్య యువతి (సారా అర్జున్) చుట్టూ తిరుగుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆమె జీవితం.. ఒక్క రాత్రిలో తలకిందులవుతుంది. యువత మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకుని, విచక్షణ కోల్పోయి ఎలా నేరాలకు పాల్పడుతున్నారో దర్శకుడు కళ్ళకు కట్టినట్లు చూపించారు. సీనియర్ నటి భూమిక నిందితుడైన యువకుడి తల్లిగా నటించింది. సాధారణంగా కన్న కొడుకు తప్పు చేస్తే కప్పిపుచ్చే తల్లులను చూస్తుంటాం. కానీ ఇక్కడ భూమిక తన కొడుకు చేసిన నేరాన్ని అంగీకరిస్తూ.. తనపై తానే కేసు వేసుకుంటుంది. కొడుకును కనడమే తను చేసిన నేరమని.. తనను శిక్షించాలని కోర్టును ఆశ్రయిస్తుంది. మాతృత్వానికి, నీతికి మధ్య జరిగే ఈ సంఘర్షణ సినిమాకే హైలైట్ కానుంది.

ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన గుణశేఖర్.. ‘‘మా అమ్మాయి నీలిమా ఎప్పుడూ ఇంత ఎమోషన్ అవదు. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసి ఎమోషన్ అయిందంటే.. ఈ కథ అంతగా ఇంపాక్ట్ చేసింది. మా కుటుంబం మొత్తం ఈ స్టోరీకి కనెక్ట్ అయింది. అలాగే మీ అందరికీ ఈ సినిమా ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా అందరూ కొత్తవాళ్లతో చేయాలని 6 నెలలు ఆడిషన్స్ చేశాం. రియల్ ఫ్రెష్ ఫేసెస్‌తో చేశాం. టాలెంట్ చూసే అందరినీ సెలెక్ట్ చేశాం. ఆడియన్స్ ఈ క్యారెక్టర్స్‌కు సులభంగా కనెక్ట్ అవుతారు. కథలో ఎడాలసెన్స్ అనేది చాలా కీలకం. అందుకోసమే టీనేజర్స్‌ను తీసుకున్నాం. అందుకే పొన్నియన్ సెల్వన్‌లో చేసిన సారా అర్జున్‌ను తీసుకున్నాం. ఆమె ఉంటేనే ఈ సినిమా చేద్దామని నీలిమ అంది. కథ చెప్పగానే సారా తండ్రి రాజ్ అర్జున్ షాక్ అయ్యారు. ఇంత మంచి కథను కచ్చితంగా జనాలకు చెప్పాలి అని అన్నారు. తల్లి పాత్రకు భూమిక అనుకోగానే నేను వద్దనన్నాను. ఆమెను తల్లి పాత్రలో చూడడం నాకు నచ్చదు. కానీ యంగ్ మదర్ కావాలని నీలిమ చెప్పడంతో ఆమెకు కథ చెప్పాము. ఒక్కడు సినిమాతో ఎంతమంచి గుర్తింపు వచ్చిందో దానికి రెట్టింపు పేరు ఈ సినిమాతో వస్తుందని చెప్పాను. ఆమె పూర్తి స్క్రిప్ట్ చదివి వెంటనే ఓకే చెప్పింది. కేవలం గ్లామర్ పాత్రలే చేస్తామని చెప్పే హీరోయిన్స్‌కు భూమిక కనువిప్పు కలిగించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కు డైరెక్టర్ గానే మంచి గుర్తింపు ఉంది. ఆయన పాత్ర చాలా నేచురల్‌గా ఉంటుంది. ఆయనకు కథ చెప్పగానే ఓకే అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవను అనుకున్నప్పుడు స్క్రిప్ట్ పంపిస్తే.. కీరవాణి గారి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే కలుద్దామన్నారు. ఇది చాలా అత్యవసరంగా తీయాల్సిన సినిమా అని చెప్పారు. కాల భైరవను పిలిచి ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా చేయమని చెప్పారు. అందుకే మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. పీఎస్ వినోద్, రత్నవేల్ దగ్గర పని చేసిన ప్రవీణ్‌ను సినిమాటోగ్రఫర్‌గా పరిచయం చేస్తున్నాం. అందరూ కథ వినే ఇలాంటి అద్భుతమైన సినిమాలో భాగం కావాలనుకున్నారు. 2026 చాలా నవ్వులతో స్టార్ట్ అయింది. అందుకే నెక్ట్స్ మంత్ ఫిబ్రవరి 6న ఒక స్పెషల్ మూమెంట్ కోసం మా యుఫోరియా సినిమాను తీసుకొస్తున్నాం. ఇది అందరూ కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రం.’’ అని చెప్పారు.

Read More : మగాడు శృంగారానికే పనికొస్తాడు.. 52ఏళ్ల నటి సంచలన కామెంట్స్

Next Story