భోపాల్ ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్ వేదిక ఖరారు

by Pulgam srinivas |

పెద్ది మేకర్స్ ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో ఈ భారీ ఈవెంట్‌ను మే 23న సాయంత్రం 5 గంటల నుంచి భోపాల్‌లోని BHEL దసరా మైదాన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

భోపాల్ ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్ వేదిక ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌ను ముంబై వేదికగా విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా భోపాల్‌లో ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రచారం సాగింది. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో ఈ భారీ ఈవెంట్‌ను మే 23న సాయంత్రం 5 గంటల నుంచి భోపాల్‌లోని BHEL దసరా మైదాన్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అంతేకాకుండా సినిమాలోని ఓ ప్రత్యేక గీతాన్ని కూడా ఈ వేదికపై విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ ఈవెంట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ అంచనాల నడుమ ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Next Story