- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏకంగా పవన్ కళ్యాణ్‍కు హిట్ ఇచ్చాడు.. ఆయనా దర్శకుడికి ఇన్ని కష్టాలా
పవన్, రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమాకు దర్శకత్వం వహించిన సాగర్ కె చంద్ర ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టైసన్ నాయుడును ప్రారంభించాడు. ఆ సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదు.

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడైనా స్టార్ హీరోలతో సినిమా చేసి దానితో మంచి సక్సెస్ను అందుకున్నట్లయితే ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరుగుతుంది. వరుస పెట్టి క్రేజీ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు వస్తుంటాయి. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్తో సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఓ దర్శకుడికి మళ్లీ అదే రేంజ్లో క్రేజ్ ఉన్న హీరో దొరకలేదు, మీడియం రేంజ్ హీరోతో సినిమా స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్నా ఇంకా విడుదల కాలేదు.
ఇంతకు ఆ దర్శకుడు ఎవరనుకుంటున్నారా? ఆయనే సాగర్ కె చంద్ర. ఈ దర్శకుడు కొంత కాలం క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దీని ద్వారా సాగర్కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో నెక్స్ట్ ఈ డైరెక్టర్కు అద్భుతమైన స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ వస్తుందని కూడా కొంతమంది భావించారు.
కానీ అలా జరగలేదు. కానీ ఈయన కొంతకాలం వెయిట్ చేసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో టైసన్ నాయుడు అనే ఎంటర్టైనర్ను స్టార్ట్ చేశాడు. దానికి సంబంధించిన ఒకటి రెండు ప్రచార చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ దీనికి సంబంధించి విడుదల తేదీపై పూర్తి క్లారిటీ లేకుండా పోయింది. దాంతో చాలామంది సాగర్, పవన్, రానా లాంటి ఇద్దరు స్టార్ హీరోలను మైంటైన్ చేసి హిట్టు కొట్టాడు, అలాంటి ఆయనకు నెక్స్ట్ సినిమా విషయంలో ఇన్ని కష్టాలా అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.






