- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదంతా నా అదృష్టం.. భీమ్స్ సిసిరోలియో కామెంట్స్
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’ ఎక్సైటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

దిశ, సినిమా: హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ‘12A రైల్వే కాలనీ’ ఎక్సైటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో తాజాగా మీడియాతో ముచ్చటించారు. ‘'12A రైల్వే కాలనీ' లాంటి థ్రిల్లర్ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నా కదా నాకే కొత్తగా ఉంది. నేనే మ్యూజిక్ చేశానా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది డిఫరెంట్ జోనర్. కొత్తగా పరిచయం అయిన వ్యక్తులతో కొత్తగా ప్రయాణం చేసిన అనుభూతి కలిగింది.
నన్ను ఈ జోనర్‌లో ఉండే మూవీస్‌కి ఈ సినిమా తీసుకెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను. నిన్ననే డిటిఎస్ లో సినిమా చూసుకున్నాను. బలే ఎక్సైటింగ్ గా ఉంది. నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేసింది. ఇందులో రెండు మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఆ రెండు పాటలు కూడా కథ నుంచే పుడతాయి. నేను చేసిన బలగం, మాస్ జాతర, ధమాకా, మ్యాడ్, టిల్లు స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం.. ఇవన్నీ ఒకటి గ్రామీణ నేపథ్యం, మాస్, యూత్ ఫుల్, ఫ్యామిలీ ఇలా డిఫరెంట్ జోనర్ సినిమాలు చేసే అవకాశం నాకు దొరికింది. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాలు ఒకేసారి రావడం నా అదృష్టం. ఇందులో రైల్వే కాలనీ ఇంకా స్పెషల్. సినిమా విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను’ అని తెలిపారు.






