Bheems Ceciroleo: శేష్ నా దగ్గరకు వచ్చారు.. నాకు నీకు ఏం సంబంధం లేదు అనేశాను

by Pulgam srinivas |

భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ... 'బలగం'లోని ఊరు పల్లెటూరు సాంగ్ విని శేషు గారు నన్ను కలిశారు, కానీ నేను మనిద్దరికీ సెట్ కాదు అని శేష్ కి చెప్పినట్లు ఈ సంగీత దర్శకుడు చెప్పారు.

Bheems Ceciroleo: శేష్ నా దగ్గరకు వచ్చారు.. నాకు నీకు ఏం సంబంధం లేదు అనేశాను
X

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ నటుడు అడవి శేష్ తాజాగా డెకాయిట్ అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ మూవీలో మొదట శృతిహాసన్ ను హీరోయిన్గా ఎంచుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆమెపై కొన్ని రోజుల చిత్రీకరణను కూడా చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ చిత్రం నుండి ఆమె తప్పుకుంది. దాంతో శృతిహాసన్ స్థానంలో మృనాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ మూవీని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు.

అడవి శేష్ హీరోగా నటించిన అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకోవటం, ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి పాత్రికేయులతో ముచ్చటించింది. అందులో భాగంగా శేష్ గురించి భీమ్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

తాజా ఈవెంట్ లో భాగంగా భీమ్స్... నేను సంగీతం అందించిన బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు సాంగ్ విని శేష్ నన్ను కలిసి అభినందించారు. దాంతో వెంటనే మనిద్దరికీ అస్సలు సెట్ కాదు సార్ అని అన్నాను. కానీ ఆయన కచ్చితంగా మనం భవిష్యత్తులో ఒక సినిమా చేయాలి అన్నాడు. ఇక ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఆరెంజ్ మూవీలోని రూబా రూబా సాంగ్ స్థాయిలో చాలా కాలం నిలిచిపోవాలని నేను కోరుకున్నాను, అలాంటి సాంగ్ని ఈ చిత్రం కోసం ఇచ్చాను అని ఆయన అన్నారు.

Next Story