అద్దం ముందు భార్యాభర్తల రొమాన్ప్

by Sujitha Rachapalli |

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది

అద్దం ముందు భార్యాభర్తల రొమాన్ప్
X

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్‌ , డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ‘బెల్లా బెల్లా’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ప్రోమోతో టీజ్ చేసిన తర్వాత మేకర్స్ సెకండ్ సింగిల్ ‘అద్దం ముందు’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియ ఓ మధురమైన మెలోడియస్‌ ట్రాక్‌ను అందించారు. మనసును హత్తుకునే బీట్‌లు, శ్రేయా ఘోషాల్‌ ఆకట్టుకునే వాయిస్ పాటను మరింత మ్యాజికల్‌గా మార్చాయి. కపిల్‌ కపిలన్‌ వాయిస్ మాధుర్యాన్ని పెంచింది. ప్రేమలో ఉన్న జంటల మనసుల మాటలను చంద్రబోస్ అద్భుతంగా రాశారు. ఒకరి కోసం ఒకరు మాత్రమే ఉన్నట్టుగా వారి ప్రేమలో ప్రతి క్షణాన్ని ఆప్యాయంగా, ఆత్మీయంగా చిత్రీకరించిన.. ‘అద్దం ముందు’ సాంగ్ హస్బెండ్–వైఫ్‌ తమ ప్రేమను వ్యక్తం చేసుకునే అద్భుతమైన మెలోడీ సాంగ్‌‌గా అలరిస్తోంది. ఇక ఈ సాంగ్‌ విజువల్‌ ఫీస్ట్‌‌లా ఉండగా.. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ, యూరప్‌ అందమైన లొకేషన్ల మధ్య తెరకెక్కిన ఈ పాటలో రవితేజ–డింపుల్‌ హయాతి కెమిస్ట్రీ అదిరిపోయింది. వారి రొమాంటిక్‌ మోమెంట్స్‌, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ప్లేఫుల్‌ ఇంటరాక్షన్స్‌ ఇవన్నీ కలిసి పాట కన్నుకపండగలా ఉంది.

Next Story