- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ రిలీజ్..ఇక మాస్ ఫ్యాన్స్ కు పండగే
భర్త మహాశయులకు విజ్ఞప్తి'. రవితేజ హీరోగా వస్తున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజ్ రవితేజ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన రవితేజ, ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేసి దూసుకు వెళ్తున్నారు. హిట్, ఫ్లాప్ అనే సంబంధం లేకుండా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూ, దుమ్ము లేపుతున్నారు. అయితే అలాంటి మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడు కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ సినిమానే భర్త మహాశయులకు విజ్ఞప్తి'. రవితేజ హీరోగా వస్తున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.
ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమోషన్స్ చేస్తూ చిత్ర బృందం రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ మూవీ నుంచి టీజర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. వదిన వాళ్ళ చెల్లెలు అంటే నా భార్యగా అంటూ రవితేజ చేసే కామెడీ టీజర్ లో అందరిని ఆకట్టుకుంటుంది. ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో రవితేజ చేసే రొమాన్స్ కూడా చాలా కొత్తగా ఉంది. తాజాగా రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాకు హైప్ పెంచింది. కాగా భర్త మహాశయులకు విజ్ఞప్తిస సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ కానుంది.






