- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. టీజర్ కు టైమ్ ఫిక్స్
కిశోర్ తిరుమల డైరెక్షన్లో.. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.

దిశ, వెబ్‌డెస్క్: కిశోర్ తిరుమల డైరెక్షన్లో.. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా సినిమా టీజర్ విడుదలకు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టీజర్ రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సరికొత్త పోస్టర్ తో వెల్లడించారు.
ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అద్దం ముందు రొమాన్స్ సాంగ్ లో డింపుల్ హయతి పద్ధతిగా చీరల్లో కనిపించడం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇక ఆషిక రంగనాథ్ కూడా రవితేజకు జోడీగా నటిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి సినిమాను నిర్మిస్తున్నారు.






