- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందుకే చిన్న గ్యాప్ ఇచ్చా.. భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "భర్త మహాశయులకు విజ్ఞప్తి" ట్రైలర్ విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజా రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "భర్త మహాశయులకు విజ్ఞప్తి". ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదాన్ని, ఆనందాన్ని పంచి కడుపుబ్బా నవ్వించేందుకు జనవరి 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ స్టార్టింగ్లోనే "ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, జాతర ఫైట్ తెగ చేసేశాను. అందుకు ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమన్నాడు." అని రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. "మగాళ్లందరూ మాసే అయినా.. ఇక్కడ ఉన్నది ఇద్దరు ఆడాళ్లు.. టాస్ వేసి బొమ్మా, బొరుసా నిలబెట్టారు. పండగ కదా ముందు ఎంటర్టైన్మెంట్.. తర్వాత అనౌన్స్ మెంట్. బుక్ మై షో అంటే ఇదే.. మన షో మనమే బుక్ చేసుకోవడం వంటి డైలాగ్స్ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచాయి.
ట్రైలర్ ను బట్టి చూస్తే పెళ్లైన భర్త ప్రేమలో పడితే ఆ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పే కథే భర్తమహాశయులకు విజ్ఞప్తి స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి నటించగా.. సునీల్, సత్య, డీజే టిల్లు ఫాదర్ మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో కనిపించారు.






