సంక్రాంతికి గోల చేద్దాం.. భర్త మహాశయుడి కోరిక..

by Sujitha Rachapalli |

మాస్ మహారాజా రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.

సంక్రాంతికి గోల చేద్దాం.. భర్త మహాశయుడి కోరిక..
X

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ చేసింది మూవీ యూనిట్. ట్రైలర్ రవితేజ యాక్షన్ సినిమాలు చాలు అనే ఆకట్టుకునే డైలాగ్‌తో ప్రారంభమై.. ప్రేక్షకులు చాలా కాలంగా మిస్ అవుతున్న ఫ్యామిలీ జోన్‌కు తిరిగి వస్తున్నాడనే ఫన్ ఇండికేషన్ ఇచ్చింది. ఫారిన్ టూర్‌లో ఆషిక రంగనాథ్‌పై ప్రేమ కలగడంతో, డింపుల్ హయతితో అతని వైవాహిక జీవితం ఊహించని విధంగా మారడంతో కథ మొదలవుతుంది. ఇద్దరు మహిళల, రెండు విభిన్న ప్రశ్నల మధ్య నలిగిపోతున్న అతని ప్రయాణం హిలేరియస్‌గా.. అదే సమయంలో ఎమోషనల్ సాగుతుంది. మొత్తంగా ట్రైలర్ కామెడీ, డ్రామా, ఎమోషన్స్, రిలేటబుల్ రిలేషన్‌షిప్ కన్ఫ్యూజన్స్‌తో.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌లో తప్పకుండా చూడాల్సిన చక్కని ఎంటర్‌టైనర్‌గా హామీ ఇస్తోంది. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన హీరో రవితేజ.. ‘ఈ సారి పండగకు సరదా సరదాగా గోల చేద్దాం. ఇదొక్కటే కాదు.. వస్తున్న అన్ని సినిమాలు ఫుల్ ఎంటర్టైమెంట్. ఈసారి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంక్రాంతి అవుతుందని నా ప్రగాఢ నమ్మకం’ అని తెలిపారు.

Next Story