రవితేజ కొత్త సినిమా టీజర్.. నవ్వులే నవ్వులు

by Sujitha Rachapalli |

మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నఈ చిత్రం సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా విడుదలైన టీజర్ అన్ని వయసుల

రవితేజ కొత్త సినిమా టీజర్.. నవ్వులే నవ్వులు
X

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నఈ చిత్రం సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా విడుదలైన టీజర్ అన్ని వయసుల ప్రేక్షకులకు పండుగ విందుగా ఉండబోతుందని స్పష్టమైంది. రవితేజ హ్యాపీ మ్యారేడ్ మ్యాన్, విదేశీ పర్యటనలో అనుకోకుండా మరొక మహిళ పట్ల ఎట్రాక్ట్ అవుతాడు. తర్వాత భావోద్వేగాల మధ్య నలిగిపోతూ.. గైడెన్స్ కోసం ఒక సైకాలజిస్ట్‌ను కలుస్తాడు.. తర్వాత హిలేరియస్ పరిస్థితులకు దారితీస్తుంది. ఫుల్ ఫన్ రైడ్‌గా ఉన్న టీజర్.. కిషోర్ తిరుమల మరోసారి నవ్వులు, సహజత్వంతో కూడిన నెరేటివ్‌తో ఆకట్టుకున్నట్లు అర్థమవుతుంది. రవితేజ తన బలమైన జోన్ అయిన కామెడీలోకి తిరిగి రాగా.. అతని హావభావాలు, అద్భుతమైన టైమింగ్ ప్రతి సన్నివేశాన్ని ఆనందదాయకంగా మార్చేస్తున్నాయి. గందరగోళానికి గురైన భర్త పాత్రను సహజంగా పోషించగా.. హ్యుమరస్ క్యారెక్టర్స్‌లో అతనికి సాటిలేదని మరోసారి గుర్తు చేస్తుంది. ఇక డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ తమ పాత్రల్లో అలరించగా.. సునీల్ పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో కనిపించడం మరింత ఉత్సాహాన్ని నింపింది.

Next Story