- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నాను.. అభిమానులు కూడా తిట్టారు.. భానుప్రియ
భానుప్రియ మాట్లాడుతూ... నేను చేసిన నాట్యం సినిమా నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. మొదట కథ చెప్పినప్పుడు చాలా గొప్పగా అనిపించింది, కానీ దాన్ని అలా తెరకెక్కించకపోవడం నాకు బాధను కలిగించింది అని చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన నటీమణులలో భానుప్రియ ఒకరు. ఈమె ఆ సమయంలో స్టార్ హీరోలుగా కెరీర్ను కొనసాగించిన ఎంతోమంది నటులతో నటించింది. ఈమె గొప్ప డాన్సర్, తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి అద్భుతమైన క్రేజ్ ఉన్న ఈ నటి కొంతకాలంగా సినిమాల సంఖ్యను చాలా వరకు తగ్గించింది. తాజాగా ఈమె నాట్యం అనే సినిమాలో నటించింది.
చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన సినిమా కావడంతో ఇందులో భానుప్రియ పాత్ర అద్భుతంగా ఉంటుందని చాలామంది భావించారు. అలా ఎక్స్పెక్ట్ చేసిన జనాలకు ఈ సినిమా ఆనందాన్ని కలిగించలేదు. తాజాగా భానుప్రియ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా నాట్యం సినిమా గురించి, అందులో తన పాత్ర గురించి అనేక విషయాలను తెలియజేసింది. తాజాగా భానుప్రియ మాట్లాడుతూ... "నేను రీసెంట్ గా నాట్యం సినిమా చేశాను. కానీ అది నాకు ఆనందాన్ని ఇవ్వలేదు.
అందుకు ప్రధాన కారణం మొదటగా ఆ సినిమాలో నాకు పాత్రను ఆఫర్ చేసిన టైంలో కథ చెప్పారు, అప్పుడు అద్భుతంగా ఉంది. ఒక కూతురిని ప్రోత్సహించే తల్లి పాత్రలో ఎంతో గొప్పగా అనిపించింది. ఆ తరువాత సినిమా స్టార్ట్ అయ్యి, పూర్తయ్యేసరికి నాకు చెప్పిన కథకు అక్కడ ఉన్నదానికి సంబంధం లేకుండా పోయింది. ఇక నా అభిమానులు కూడా ఆ సినిమా విషయంలో నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఆ సినిమా చేసినందుకు నేను కూడా ఫీలవుతున్నాను" అని భానుప్రియ తాజాగా కామెంట్ చేసింది.






