భైరవం థీమ్ సాంగ్ వచ్చేసిందోచ్.. పవర్‌ఫుల్ లిరిక్స్‌తో పూనకాలు తెప్పిస్తున్న పాట

by Gugulothu.Kavitha |   (  Updated:2025-07-26 03:59:03  IST  )

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు విష్ణు(Manchu Vishnu), నారా రోహిత్(Nara Rohith) కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’(Bhairavam).

భైరవం థీమ్ సాంగ్ వచ్చేసిందోచ్.. పవర్‌ఫుల్ లిరిక్స్‌తో పూనకాలు తెప్పిస్తున్న పాట
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu manoj), నారా రోహిత్(Nara Rohith) కాంబోలో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘భైరవం’(Bhairavam). విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో జయసుధ(Jayasudha) కీలక పాత్రలో నటిస్తుంది. ఇందులో ఆనంది(Anandi), అదితి శంకర్(Aditi Shankar), దివ్య పిళ్లై(Divya Pillai) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక దీనిని శ్రీసత్యసాయి ఆర్ట్స్(Sri Sathya Sai Arts) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే భైరవం నుంచి ముగ్గురు హీరోలు, హీరోయిన్ల పోస్టర్లు విడుదలై భారీ హైప్‌ను క్రియేష్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘భైరవం థీమ్’ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ‘భైరవం’ సాంగ్‌లో తాండవం చేసినట్లుగా మనకు ఈ లిరికల్ వీడియోలో చూపెట్టారు. మహాశివరాత్రి పర్వదినం దగ్గర్లో ఉండటంతో ఈ పాటను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ పాటకు చైతన్య ప్రసాద్(Chaitanya Prasad) లిరిక్స్ రాయగా, శ్రీచరణ్ పాకాల(Sricharan Pakala) చక్కటి సంగీతం అందించాడు. శంకర్ మహదేవన్(Shankar Mahadevan) ఈ పాటను అద్బుతంగా ఆలపించారు.

Video Link

Next Story