హీరో, హీరోయిన్ల వనభోజనాలు.. టేస్ట్ నెక్ట్స్ లెవెల్ అంటూ స్టార్ డైరెక్టర్ కూతురు కాంప్లిమెంట్!

by Gantepaka Srikanth |

వనభోజనాలు(Vanabhojanalu) అనేవి ఎక్కువగా గ్రామాల్లో చూస్తుంటాం. నగరాల్లో చాలా తక్కువ.

హీరో, హీరోయిన్ల వనభోజనాలు.. టేస్ట్ నెక్ట్స్ లెవెల్ అంటూ స్టార్ డైరెక్టర్ కూతురు కాంప్లిమెంట్!
X

దిశ, వెబ్‌డెస్క్: వనభోజనాలు(Vanabhojanalu) అనేవి ఎక్కువగా గ్రామాల్లో చూస్తుంటాం. నగరాల్లో చాలా తక్కువ. ఎక్కడో ఒకచోట నగరాల్లో వనభోజనాలు జరుపుకునే వారు కూడా గ్రామాల నుంచి వచ్చి స్థిరపడిన వారే. అయితే.. తాజాగా నటీనటులు వనభోజనాలు జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit), బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌(Bellamkonda Sai Srinivas)లు భైరవం(Bhairavam Movie) అనే సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఈ క్రమంలోనే చిత్రబృందం మొత్తం కలిసి వినూత్నంగా వనభోజనాలకు వెళ్లారు. అక్కడ స్వయంగా వారే వంట చేసుకొని మరి అంతా కలిసి తిన్నారు.

నారా రోహిత్, మంచు మనోజ్‌లు ఫైవ్ స్టార్ హోటళ్లలోని చెఫ్‌ల మాదిరి గరిటే తిప్పే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి గమనించిన నెటిజన్లు వాటే థాట్.. ఇలాంటి ప్రమోషన్స్ ఎవరూ ఎక్ట్‌పెక్ట్ చేయలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మంచు మనోజ్, నారా రోహిత్ చేసిన వంట అదిరిపోయిందంటూ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. కాగా, ఈ భైరవం చిత్రానికి విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించాడు. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా నటించారు. మే 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

Next Story