డెస్టినీ డిసైట్ చేసింది.. నేను ఓకే చేశా.. భాగ్యశ్రీ బోర్సే షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2026-07-03 16:03:22  IST  )

డెస్టినీ డిసైట్ చేసింది.. నేను ఓకే చేశా.. భాగ్యశ్రీ బోర్సే షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే త్వరలో ‘లెనిన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. అక్కినేని అఖిల్ హీరోగా, దర్శకుడు కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీ జులై 10న రిలీజ్‌కు రాబోతున్నది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా.. ఈ సినిమా ఆఫర్ తన వద్దకు రెండు సార్లు వచ్చినట్లు చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ‘నేను సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. నిజానికి నేను ఈ సినిమాలో నటించాలని రాసిపెట్టి ఉంది. ఎందుకంటే.. ఇందులోని ‘భారతి’ అనే పాత్ర కోసం ఫస్ట్ నన్ను సంప్రదించినప్పుడు డేట్స్ కుదరకపోవడం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయాను. కానీ అదృష్టవశాత్తూ ఆ అవకాశం మళ్లీ నాకు దక్కింది. అప్పుడు అనిపించింది డెస్టినీ గట్టిగా డిసైట్ అయ్యింది.. నేను ఇందులో భాగం కావాలని. అందుకే నాకు ఈ ఆఫర్ రెండు సార్లు వచ్చింది అనుకుని ఓకే చెప్పేశా. ఇందులో భారతి పాత్ర చాలా నేచురల్‌గా, రియలెస్టిక్‌గా ఉంటుంది. కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటోంది. సినిమా అయిపోయాక ఆడియన్స్ అందరూ నన్ను ‘భారతి’ అని పిలవాలి.. అదే నాకు విజయం’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. లెనిన్ సినిమాలో మొదట శ్రీలీలను హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. డేట్స్ కారణంగా ఆమె తప్పుకోవడంతో మళ్లీ ఈ ప్రాజెక్టు భాగ్యశ్రీ చెంతకే చేరింది.

Next Story