Bhagyashree Borse: ఆ అందం ఏంటి బాబోయ్.. ఒక్క సాలిడ్ హిట్టు పడితే అస్సలు ఆపలేము

by Pulgam srinivas |   (  Updated:2026-04-04 11:38:17  IST  )

Bhagyashree Borse: చాలా సినిమాలు చేసినా ఒక్క హిట్ లేదు… అయినా బ్యూటీకి సూపర్ క్రేజ్.

Bhagyashree Borse: ఆ అందం ఏంటి బాబోయ్.. ఒక్క సాలిడ్ హిట్టు పడితే అస్సలు ఆపలేము
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో అందం, నటన రెండింటితో ప్రేక్షకులను ఆకట్టుకునే నటీమణులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు.

అలాంటి వారిలో యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఒకరు. ఈమె మిస్టర్ బచ్చన్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో ఆమె తన నటనతో పాటు గ్లామర్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ వంటి చిత్రాల్లో ఆమె తన అందాల ప్రదర్శనతో పాటు నటనకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

భాగ్యశ్రీ ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ కాలమే అయినప్పటికీ, వరుస అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

అయితే ఇప్పటివరకు ఈ నటికి పెద్ద స్థాయి విజయం మాత్రం దక్కలేదు. అయినప్పటికీ ఈ యంగ్ హీరోయిన్‌కు మంచి క్రేజ్ ఉండటం విశేషం.

దాంతో చాలామంది సినీ విశ్లేషకులు, అభిమానులు భాగ్యశ్రీ బోర్సేకు ఒక బ్లాక్‌బస్టర్ హిట్ దక్కితే, ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్‌కి చేరుకోవడం మాత్రమే కాకుండా తిరుగులేని రీతిలో కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Photos Courtesy: Instagram

Next Story