- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్.. హీరోయిన్గా యంగ్ బ్యూటీ!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తున్నాడు.

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తున్నాడు. త్వరలో ‘ది రాజాసాబ్’మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 9న రిలీజ్ కానుంది. ప్రజెంట్ ఈ మూవీ పనులతో బిజీగా ఉండగానే.. ఫౌజీ, సలార్ 2, స్పిరిట్, కల్కి 2 వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇక ఇవే కాకుండా.. హోంబలే ఫిలిమ్స్‌తో చేతులు కలిపి మరో రెండు ప్రాజెక్టులు లైన్లో పెట్టినట్లు తెలుస్తుండగా.. అందులో ఒకటి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాబోతున్నట్లు టాక్.
ఈ క్రమంలోనే.. ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది. ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ చాలా బాగా జరుగుతుందని తెలుస్తుంది. అలాగే.. ఇంకా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోమని హోంబలే ఫిల్మ్స్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు స్పష్టం చేసినట్లు టాక్. దీంతో ప్రస్తుతం సీన్ ప్రీ-విజువలైజేషన్ అండ్ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి వేగంతో జరుగుతున్నట్లు టాక్. ఇక ప్రభాస్ డేట్స్ కన్ఫర్మ్ చేస్తే షూటింగ్ ఆలస్యం లేకుండా వెంటనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో ప్రభాస్‌కు జంటగా భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్గా తీసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీనిపై త్వరలో అఫీషియల్ అప్డేట్ రాబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. లింక్
READ MORE ....
‘ది రాజాసాబ్’ వాయిదాపై స్పందించిన మేకర్స్.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ కీలక నోట్ విడుదల






