- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhagyashri Borse: పాన్ ఇండియా మూవీలో భాగ్యశ్రీ బోర్సే.. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్
యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది. అయితే ఈ మూవీతో ఆమె ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది. అయితే ఈ మూవీతో ఆమె ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అనతి కాలంలోనే క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఈ అమ్మడు వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం కాంత, కింగ్‌డమ్(Kingdom), ఆంధ్రా కింగ్ తాలూకా వంటి చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా, ఈ భామ మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. ఈ మేరకు మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ‘రాజా శివాజీ’ (Raja Shivaji)టైటిల్‌తో రాబోతుంది. అయితే ఈ చిత్రానికి రితేష్‌విలాస్ రావు దేశ్‌ముఖ్ దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని జ్యోతి దేశ్‌పాండే, జెనీలియాదేశ్‌ముఖ్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), మహేష్ మంజ్రేకర్, సచిన్‌కెడేకర్, ఫరీద్ ఖాన్, జితేంద్ర జోషి, అమూల్ గుప్తా, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్(Ritesh Deshmukh) కీలక పాత్రలో కనిపించనున్నారు.
దీనికి అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ భాషల్లో వచ్చే ఏడాది మే 1న థియేటర్స్‌లోకి రానుంది. చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇక పోస్టర్ గమనించినట్లయితే.. మంటల్లో నడుస్తున్న ఓ వ్యక్తి శరీరమంతా రక్తంతో ఉండగా.. రెండు చేతుల్లో పెద్ద కత్తులు పట్టుకుని పవర్ ఫుల్ లుక్‌లో కనిపించాడు. అయితే ఇందులో రెండు రెడ్ జెండాల మధ్యలో ఫేమ్ ఉండగా.. క్లియర్‌గా కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతోంది.






