- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనక్కం చెన్నై.. తమిళ ప్రాజెక్టుపై హింట్ ఇచ్చేసిన యంగ్ హీరోయిన్
యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయిందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయిందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు ఈ అమ్మడుకు సరైన హిట్ రాకపోవడంతో.. కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అడుగులు వేస్తుందని వార్తలు వచ్చాయి. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, దర్శకుడు శివకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సెయాన్’. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీని కమల్ హాసన్ తన బ్యానర్‌పై నిర్మిస్తుండటంతో ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించనున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానప్పటికీ.. ఇది భాగ్యశ్రీకి మంచి ఆఫర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు అభిమానులు. అయితే.. ఈ వార్తలపై ఇన్‌డైరెక్ట్ హింట్ ఇచ్చేసింది ఈ యంగ్ హీరోయిన్. ఈ మేరకు తాజాగా తన ఇన్‌స్టావేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అందులో.. శివకార్తీకేయన్ ‘అమరన్’ సాంగ్ పెట్టుకుని ‘వనక్కం చెన్నై’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో శివకార్తీకేయన్ సినిమాలో భాగ్యశ్రీ భాగం అయినట్లు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేంసిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.






