Bhagyashri Borse: టాలీవుడ్ హీరోతో భాగ్యశ్రీ బోర్సే డేటింగ్.. ఎంగేజ్‌మెంట్ కూడా అయిందా? సంచలనంగా మారిన పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-04-21 14:34:09  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకుంది.

Bhagyashri Borse: టాలీవుడ్ హీరోతో భాగ్యశ్రీ బోర్సే డేటింగ్.. ఎంగేజ్‌మెంట్ కూడా అయిందా? సంచలనంగా మారిన  పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ మూవీ హిట్ సాధించనప్పటికీ.. ఆమె అందం, నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. దీంతో భాగ్యశ్రీ బోర్సేకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రజెంట్ ఈ భామ కింగ్‌డమ్(Kingdom), రాపో-22(Rapo-22), కాంత వంటి భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni)తో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరు షేర్ చేసిన ఫొటోల్లో బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉండడంతో డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. అయితే వీరి ఒకే రూమ్‌లో ఉన్నారంటూ పలు పుకార్లు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఆ ఫొటో చూసిన నెటిజన్లు ‘ఒకే గతిలో ఫొటో దిగారా ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయిందా? అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మీ చేతికి ఉన్న ఉంగరం ఎవరు తొడిగారు? ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయిందా? అని ప్రశ్నించగా.. దానికి భాగ్యశ్రీ బోర్సే స్పందించింది. ‘‘అది నేను కొనుక్కున్నాను’’ రిప్లై ఇవ్వడంతో డేటింగ్ వార్తలకు చెక్ పడినట్లు అయింది. ప్రస్తుతం రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ఫొటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Next Story