- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు సినిమాలకే చాలా ఫాలోయింగ్.. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటున్న భాగ్యశ్రీ బోర్సే
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.

దిశ, సినిమా: రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా.. భారీ అంచనాల మధ్య నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘ఇందులో నా పర్ఫార్మెన్స్‌కి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌కు చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు నటిగా నాలో ఉన్న పొటెన్షియల్ చూశారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఆంధ్రా కింగ్‌లో నేను మహాలక్ష్మి క్యారెక్టర్‌లో కనిపిస్తాను. కథలో నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఈ క్యారెక్టర్ ఆడియన్స్ గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. అభిమానం అనేది డివైన్ ఎమోషన్. రెండు సినిమాలకే నాకు చాలా ఫాలోయింగ్ వచ్చింది. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ ఇలాంటి సపోర్టు ఉండదు. అందరూ కూడా తమ అమ్మాయిగా అభిమానాన్ని చూపించారు.ఇలాంటి అభిమానం గౌరవం ప్రేమ మరింత పొందాలని కోరుకుంటున్నాను’ అని తెలిపింది.






