- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhagya Sri Borse: 'ఎల్లమ్మ' ఆఫర్ వచ్చింది.. కానీ ఆ కారణంతోనే నో చెప్పా
ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో 'ఎల్లమ్మ' సినిమా చేయలేకపోయానని భాగ్య శ్రీ వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్‌ను విజయవంతంగా ముందుకు సాగిస్తున్న యువ నటీమణుల్లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. తాజాగా ఈ బ్యూటీ, అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన 'లెనిన్' చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీ వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాకు ప్రచారం నిర్వహిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమెను, "'ఎల్లమ్మ' చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మిమ్మల్ని సంప్రదించారనేది నిజమేనా?" అని ప్రశ్నించగా, భాగ్యశ్రీ స్పందిస్తూ... "అవును, 'ఎల్లమ్మ' సినిమా కోసం నన్ను మేకర్స్ సంప్రదించారు.
అయితే ఆ సమయంలో నేను ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాను" అని వెల్లడించింది. ఇదిలా ఉంటే, 'ఎల్లమ్మ' చిత్రంలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండగా, వేణు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే సురభి ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నట్లు, ఇప్పటికే ఆమెపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.






