- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనా పీస్ : దేశభక్తిని రగిలించే ‘భగ భగ’ సాంగ్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’.

దిశ, సినిమా : నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యుమర్ ఎలిమెంట్స్‌తో టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ‘భగ భగ’ సాంగ్ రిలీజ్ చేశారు. కంపోజర్ కార్తిక్ దేశభక్తి రగిలించేలా ఈ పాటని స్వపరిచారు. కాల భైరవ పవర్ ఫుల్ వోకల్స్ సాంగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్ళాయి. తన పదాలని ఆయుధాలుగా మార్చి రెహమాన్ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.






