కమల్ హాసన్‌కు షాక్.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు

by Naga Rani Yarlagadda |

తమిళ సినీ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తాజాగా కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై మంగళూరు కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

కమల్ హాసన్‌కు షాక్.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ సినీ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) తాజాగా కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై మంగళూరు కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భాషా పరంగా కనీస గౌరవం పాటించాలని, కన్నడ భాష లేదా సంస్కృతిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది.

కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో.. కమల్‌ హాసన్‌ భాషపై ఆధిపత్య భావన కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దీంతో కోర్టు స్పందిస్తూ.. ‘‘భాష, సంస్కృతి, సాహిత్యాన్ని నిందించేలా మాట్లాడరాదు. సోషల్ మీడియా గానీ, ఇతర వేదికలపై గానీ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు’’ అని స్పష్టంగా పేర్కొంది.

ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 30కి వాయిదా వేసింది. కమల్‌ హాసన్‌ ఆ రోజున వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని సూచించింది. ఈ వివాదం చెన్నైలో జరిగిన ‘థగ్ లైఫ్’ ఈవెంట్‌ సమయంలో ప్రారంభమైంది. అక్కడ పాల్గొన్న కమల్‌ హాసన్‌, శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘మీ భాష కూడా తమిళం నుంచే పుట్టింది’’ అనే వ్యాఖ్యలు చేశారు. ఇది కన్నడ ప్రజల్లో ఆగ్రహం రేపింది. ఇదిలా ఉండగా.. కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రం (Thug Life Movie) తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) విడుదల అయింది. కన్నడ భాషతో సహా పలు భాషల్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ పరిణామాల మధ్య కోర్టు జారీ చేసిన ఆదేశాలు, భాషల పరస్పర గౌరవాన్ని గుర్తు చేస్తున్నాయి.

Next Story